- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి
అట్టహాసంగా ఆఫీసు ప్రారంభోత్సవం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రముఖులు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆఫీసుకు వచ్చి అభినందనలు
మంగళగిరి, డిసెంబరు 14: ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్గా శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిగారు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామక్రిష్టా రెడ్డిగారు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖామాత్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్‌గారు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డిగారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుగారు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌గారు, రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై నేదురుమల్లికి అభినందనలు తెలియజేశారు.
కమ్యూనిటీ
డెవలప్మెంట్ బోర్డు ఉద్దేశాలను ఆచరణలో
పెట్టి, అనుకున్న లక్ష్యాలను సాధించడమే తన కర్తవ్యం
ఎపి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చెయ్యడంలోని ఉద్దేశాలను ఆచరణలో పెట్టి, ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించడమే తన ముందున్న కర్తవ్యమని బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
మంగళవారం బాధ్యతలు స్వీకరణ అనంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళారన్నారు. ఈ రకమైన వ్యవస్థతో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.
ఇదే క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు మరో విన్నూత్నమైన కార్యక్రమంగా రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే గొప్ప విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అధారపడుతున్న వ్యవసాయం, విద్య, వైద్యం,పరిశ్రమలు, చేనేత వంటి అనేక రంగాలలో ఉద్యోగ- ఉఊఫాధి, వ్యాపార, వాణిజ్య అవకాశాలను కళాశాలల విద్యార్థులతో అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా బోర్డు సేవలందిస్తుందని అన్నారు.
Comments
Post a Comment