డాక్టర్‌ దువ్వూరుకు మరో ప్రతిష్టాత్మకమైన ఎఓఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు

డాక్టర్‌ దువ్వూరుకు మరో ప్రతిష్టాత్మకమైన ఎఓఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు

ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలంగాణవాసి

హైదరాబాదు, జనవరి 09:

డాక్టర్‌ దువ్వూరు ద్వారకానాదరెడ్డిగారికి ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఓటోలెరంగాలజిన్స్‌ ఆఫ్‌ ఇండియా లైఫ్‌టైం  అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. ఇటీవలనే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ డాక్టర్‌ దువ్వూరి ద్వారకానాదరెడ్డిగారు చేసిన అత్యుత్తమ సేవలకు మెచ్చి తమ ప్రతిష్టాత్మకమైన ఐఎంఎ లైఫ్‌బైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించి ఘనంగా సత్కరించింది. కొద్దిరోజులకే ఎఓఐ (ఇఎన్‌టి) కూడా లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించడం, ఈ రెండు అవార్డులను దక్కించుకున్న తొలి తెలంగాణవాసి కావడం సంతోషకరమైన విషయం.

అదివారం నాడు జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీ కో ఆపరేటివ్‌ సాసైటీ ఆవరణలో ఆపి (అమెరికన్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌) ఎలక్ట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రవి కొల్లి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ నాయకులు డాక్టర్‌ సురేంద్రనాథ్‌లు సత్కరించారు. ఈ సందర్భగా డాక్టర్‌ దువ్వూరు ద్వారకానాధరెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల సుధీర్హ ప్రయాణంలో అటు వైద్యుల సంఘంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను ఉచితంగా అందించే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ విభజన తరువాత ఈ అవార్డులను అందుకుంటున్న తొలివ్యక్తిగా తాను వుండటం ఎంతో సంతోషకరంగా వుందన్నారు.

డాక్టర్‌ దువ్వూరు ద్వారకానాధరెడ్డిగారు ప్రస్తుతం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సిడబ్లూూసి మెంబరుగాను, ఐఎంఎ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు.

గతంలో ఆయన ఐఎంఎ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగాను, రాష్ట్ర ఉపాధ్యక్తులుగాను పనిచేశారు. అలాగే ఆయన ప్రస్తుతం తెలుగు మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఇన్‌ యుఎస్‌ఎ, (ఎడిఎంజి యుఎస్‌ఎ) సంస్థకి వోవర్సీస్‌ కో ఆర్జినేటర్‌గా, నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌కు వోవర్సీస్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌నకు (టిటిఎ)కి ఓవర్సీస్‌ డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు. ఎఓఐ నేషనల్‌ బాడీ కరోనా నేపథ్యంలో డాక్టర్‌ దువ్వూరుకు వర్చువల్‌గా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేశారు.

Comments