- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
డాక్టర్
దువ్వూరు ద్వారకానాధరెడ్డిగారికి
ఐఎంఏ
లైఫ్‌టైం అచీవ్‌మెంట్
అవార్డు
ఈ అవార్డును అందుకుంటున్నతొలి తెలంగాణవాసి
హైదరాబాదు,
డిసెంబరు 22:
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా డాక్టర్ దువ్వూరి ద్వారకానాథ్ రెడ్డి గారిని వరించింది. బుధవారం నాడు ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి డాక్టర్ దువ్వూరి ద్వారకానాథరెడ్డి గారికి సందేశం అందింది.
డాక్టర్ దువ్వూరి ద్వారకానాధరెడ్డిగారు ప్రస్తుతం ఐఎంఏ సిడబ్లూసి మెంబరుగాను, ఐఎంఏ 'యాక్టన్ కమిటీ నేషనల్ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగాను, రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను పనిచేశారు.
సుమారు నాలుగు దశాబ్దాల ఐఎంఏ ప్రయాణంలో ఆయన సేవల్ని గుర్తించి ... ఐఎంవి నేషనల్ ప్రెసిడెన్స్ అప్రిసియేషన్ అవార్డ్ ఫర్ లైఫ్ లాంగ్ సర్వీసెస్ టు ఐఎంఏ ... అనే అవార్డును ప్రకటించారు. ఐఎంఏ లైఫ్ బైం అచీవ్‌మెంట్ అవార్డును తెలంగాణలో అందుకున్న తొలి వ్యక్తి డాక్టర్ దువ్వూరి ద్వారకానాధరెడ్డి కావడం విశేషం. డిసెంబరు 27, 28 తేదీల్లో బీహార్ రాష్ట్రం పాట్నాలో జరగనున్న ఐఎంఏ 82వ కేంద్ర మండలి వార్షికోత్సవంలో ఈ అవార్డును అందించనున్నారు.
ఇటీవల ఏఓఐ (ఇఎన్‌టి) నేషనల్ బాడీ డాక్టర్ దువ్వూరి ద్వారకానాధరెడ్డిగారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును దక్షిణ భారతదేశంలోనే అందుకుంటున్నతొలి వ్యక్తి కావడం విశేషం. 2022 జనవరి 6వ తేదీన రాంచిలో జరగనున్న ఏఒఐ సదస్సులో అవార్డును అందజేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్యుల సేవా రంగంలో విశిష్టసేవలను గుర్తించి డాక్టర్ దువ్వూరి ద్వారకానాధరెడ్డి గారికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఐఎంఏ, ఏఓఐ (ఇఎన్‌టి) సంస్తలకు పలువురు డాక్షర్లు అభినందనలు తెలుపుతున్నారు.
డాక్టర్ దువ్వూరిగారు ప్రస్తుతం అసోసియేషన్ తెలుగు మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ యుఎస్‌ఏ,(ఎడిఎంజి యుఎస్‌ఏ) కి ఓవర్సీస్ కో ఆర్డినేటర్‌గాను, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)కు ఓవర్సీస్ కో ఆర్డినేటర్‌గాను, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ)కి ఒవర్సీస్ డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్నారు.
AJANTHA PUBLIC RELATIONS
Our Ajantha Public Relations Agency has been organizing PR and traditional marketing in addition to digital marketing under the supervision of exceptionally experienced experts for two decades.
Do you wish to expand your business through digital marketing during these times when people are watching the world of commodities, all comforts, luxuries and services?
Are you thinking of enhancing your income?
Are you in need of the strategies of digital marketing for the promotion of your business? Do you intend to get demand and good value for your products and services?
Are you thinking of getting a website and a video prepared with good content?
Come to us for our assistance. Our Ajantha Public Relations Agency provides clarifications to your doubts and responses to your questions and shows you the right path with new thoughts at each halt acting as a tool to guide your steps in your successful journey.
For More Info Contact us on :+91 9391784714
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment